2015-05-07 00:28:37.0
అంగారక గ్రహంపై నివసించడానికి మీ దగ్గర ఐడియాలు ఉన్నాయా? అయితే వెంటనే నాసాకు పంపండి. ఉత్తినే కాదు, మొత్తం 15,000 డాలర్లును ప్రైజ్ మనీగా ప్రకటించింది. మార్స్‌పై సుదీర్ఘకాలం నివసించడానికి నివాసం, ఆహారం, నీరు, గాలి తదితర అవసరాలపై మీకున్న ఆలోచనలు పంపాలని కోరుతోంది. వీటిలో ఉత్తమమైన 3 ఐడియాలకు 5000 డాలర్ల చొప్పున ఇవ్వనుంది. అంగారకుడిపై మానవులను పంపేందుకు కొన్నేళ్లుగా నాసా పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా సామాన్యుల నుంచి వినూత్న ఆలోచనలు కోరుతోంది. ఇంకెందుకు […]
అంగారక గ్రహంపై నివసించడానికి మీ దగ్గర ఐడియాలు ఉన్నాయా? అయితే వెంటనే నాసాకు పంపండి. ఉత్తినే కాదు, మొత్తం 15,000 డాలర్లును ప్రైజ్ మనీగా ప్రకటించింది. మార్స్‌పై సుదీర్ఘకాలం నివసించడానికి నివాసం, ఆహారం, నీరు, గాలి తదితర అవసరాలపై మీకున్న ఆలోచనలు పంపాలని కోరుతోంది. వీటిలో ఉత్తమమైన 3 ఐడియాలకు 5000 డాలర్ల చొప్పున ఇవ్వనుంది. అంగారకుడిపై మానవులను పంపేందుకు కొన్నేళ్లుగా నాసా పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా సామాన్యుల నుంచి వినూత్న ఆలోచనలు కోరుతోంది. ఇంకెందుకు ఆలస్యం? వివరాలకు వెంటనే నాసా వెబ్‌సైట్ ను చూడండి.