2022-12-12 10:57:37.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/12/430908-antarmathanam.webp
మూడుకాలాలు ఒక్కుమ్మడిగా
ప్రశ్నల పిడుగుల వర్షం కురిపిస్తే
ఊహ నిలువదు, ఊపిరాడదు.
ఇన్నేళ్ళ జీవితంలో
ఏమి సాధించావని
ఒకటే ప్రశ్నల పరంపర
ఇంతకుముందు తప్పుల కుప్పలు
దిద్దుకున్నవి కొన్ని
దిద్దుకోలేనివి కొన్ని
చేతికందిన ఈరోజు
సమాయత్త లోపంతో
కరిగిపోయింది, నిరర్ధకంగా
ముందు కాలాన్ని తొంగి చూస్తే
అనుమానాలు, అపోహలు
సరిగా కనపడని ముళ్లబాటలు
అందుకే ఈ అంతర్మధనం
అనుభవాల పునాదిగా
కొత్త జవాబులు వెతుక్కుంటూ
చేసిన తప్పులు చేయకుండా
నిర్భయంగా, నిర్మాణాత్మకంగా
కొత్త పుంతల వెలుగులోకి
సులభంగా సుదీర్ఘంగా
ఆనందంగా, అందరితో కలిసి
నవ్వుతూ, నవ్విస్తూ !!!
శాంతమూర్తి
Shantamurthy,Telugu Kathalu,Telugu Kavithalu