అంత డబ్బు మేమెన్నడూ చూడలేదు

2024-12-25 05:51:30.0

రూప్పర్‌ అణు పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్‌ డాలర్లు దోచుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై హసీనా తనయుడి స్పందన

ప్రధాని పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనాపై స్వదేశంలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. పలు కేసులు నమోదవుతున్నాయి. రూప్పర్‌ అణు పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్‌ డాలర్లు దోచుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ స్పందించారు. కావాలనే తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బోగస్‌ ఆరోపణలు చేస్తూ మా కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతున్నది. ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో మా కుటుంబం ఎన్నడూ జోక్యం చేసుకొని డబ్బు తీసుకోలేదన్నారు. 10 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టుఓ అంత మొత్తం తీసుకోవడం సాధ్యం కాదన్నారు.అక్రమాస్తుల విచారణ పూర్తిగా బూటకమని, దుష్ప్రచారం తప్ప మరొకటి కాదని అన్నారు. గత 30 ఏళ్లుగా నేను యూఎస్‌లో ఉన్నాను. మా ఆంటీ, ఇతర సోదరులు యూకేలో ఉంటున్నారు. అసలు అంత డబ్బు మా అకౌంట్లలో ఎన్నడూ చూడలేదని వివరణ ఇచ్చారు. 

‘None of us ever saw that kind of money’,Sheikh Hasina’s son,Sajeeb Wazed,On $5 billion graft probe,Completely bogus,smear campaign