అందమైన, ఆరోగ్యవంతమైన కురులకోసం

https://www.teluguglobal.com/h-upload/2023/09/14/500x300_825356-hair.webp
2023-09-18 04:04:58.0

మన అందం మొత్తం జుట్టుపైనే ఆధారపడి వుంటుందని భావిస్తాం. అందుకే ప్రతి ఒక్కరు జుట్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు.

మన అందం మొత్తం జుట్టుపైనే ఆధారపడి వుంటుందని భావిస్తాం. అందుకే ప్రతి ఒక్కరు జుట్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక్క వెంట్రుక రాలిపోయినా ఏదో జీవితాన్ని కోల్పోయినంత బాధపడతారు చాలామంది. జుట్టు రాలకుండా బలంగా ఉండాలంటే బాదం, వాల్ నట్, ఆకు కూరలు, క్యారెట్లు, బీన్స్, సీజనల్ ఫ్రూట్స్, గుడ్లు, చేపలు వంటివి తినాలి.

వాస్తవానికి, జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, విటమిన్స్-ఎ, బి, సి మరియు మెగ్నీషియం వంటి పోషకాలు అవసరం. ఇవన్నీ పైన చెప్పిన వాటిలో సమృద్దిగా ఉంటాయి. అయితే మనం కొన్ని పదార్థాలు తిన్నప్పుడు కూడా జుట్టు రాలుగుతుంటుంది. అవేమిటో కూడా తెలుసుకుందాం.

చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం జుట్టుకు మంచిది కాదు. హార్మోన్ల సమతుల్యత క్షీణించడంతోపాటు ఆ ప్రభావం జుట్టు పెరుగుదలలో కూడా కనిపిస్తుంది.

అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా.. ఇందులో పోషకాలుండవు, కొవ్వు, చక్కెర మాత్రమే ఉంటాయి. పోషకాలు లేకపోవడంవల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి. అతిగా తినే ఫాస్ట్ ఫుడ్ ప్రభావంకూడా జుట్టుపై పడుతుంది. పొడవాటి జట్టు కోరుకునేవారు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

ఇక మద్యం, ధూమపానాలు ఎలాగూ వదిలేయక తప్పదు. అలాగే కెఫీన్ అధికంగా తీసుకోవడంవల్ల శరీరం డీ హైడ్రేట్ కు గురవుతుంది. ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కెఫీన్ కు దూరంగా ఉండాలి. ఒత్తయిన పొడవాటి జుట్టు కావాలనుకునే వారు ఇవన్నీ తప్పక పాటించాలి.

వీటితోపాటు.. వారానికి కనీసం రెండుసార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానికి ముందు స్కాల్ప్ మసాజ్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మెంతులు, హెన్నా హెయిర్ ప్యాక్ లు చుండ్రుని నివారిస్తాయి. అలాగే తలస్నానానికి కుంకుడుకాయ, సీకాయలు ఉపయోగిస్తే అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాదు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

Hair,Hair Growth Tips in Telugu,Haircare,Health Tips
healthy hair, hair growth, health, health news, telugu news, telugu global news, latest telugu news, news, telugu health tips, జుట్టు, బాదం, వాల్ నట్, ఆకు కూరలు, క్యారెట్లు, బీన్స్

https://www.teluguglobal.com//health-life-style/for-beautiful-healthy-hair-962229