http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/nurse-old-man.gif
2016-04-11 04:05:55.0
నగరాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సదుపాయాలు, వసతులు పెరుగుతుంటాయి. అవి కొత్త ఉపాధి మార్గాలుగానూ మారుతుంటాయి. ప్రస్తుతం వేసవిలో విహార యాత్రలకు వెళ్లే ప్లాన్‌లో ఉన్న కుటుంబాలు తమ ఇళ్లలోని పెద్దలను జాగ్రత్తగా చూసుకునే నర్సులకోసం వెతుకుతున్నాయి. ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్న పెద్దవారిని కంటికి రెప్పలా చూడటం ఆ నర్సు బాధ్యత. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనిచేయాల్సి వస్తోందని ఆ పెద్దల తాలూకూ కుటుంబ సభ్యులు కొందరు చెబుతున్నారు. పదేళ్లలో మొదటిసారిగా ఒక […]
నగరాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సదుపాయాలు, వసతులు పెరుగుతుంటాయి. అవి కొత్త ఉపాధి మార్గాలుగానూ మారుతుంటాయి. ప్రస్తుతం వేసవిలో విహార యాత్రలకు వెళ్లే ప్లాన్‌లో ఉన్న కుటుంబాలు తమ ఇళ్లలోని పెద్దలను జాగ్రత్తగా చూసుకునే నర్సులకోసం వెతుకుతున్నాయి. ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్న పెద్దవారిని కంటికి రెప్పలా చూడటం ఆ నర్సు బాధ్యత. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనిచేయాల్సి వస్తోందని ఆ పెద్దల తాలూకూ కుటుంబ సభ్యులు కొందరు చెబుతున్నారు. పదేళ్లలో మొదటిసారిగా ఒక హాలిడే ట్రిప్‌కి ప్లాన్ చేసుకున్న కుటుంబంలోని ఒక మహిళ, ఇలా చేయడం గిల్టీగా అనిపిస్తున్నా మాకూ కాస్త మనశ్శాంతి అవసరం…అందుకే తప్పడం లేదు అంటున్నారు. ఆ మహిళ తల్లి 87ఏళ్ల వృద్ధురాలు మతిమరుపు వ్యాధి అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆమె ప్రయాణం చేసే స్థితిలో లేరు. దాంతో వారికి ఒక బాధ్యతగల నర్సు అవసరం కలిగింది. అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో వివాహాలకు హాజరవుతున్నవారు కూడా పెద్దవాళ్ల బాధ్యతలను తాత్కాలికంగా చూసుకునే మనుషుల కోసం వెతుకుతున్నారు. కొంతమంది తమ ఇళ్లలోనే పెద్దలకు సేవలు అందించే వారికోసం చూస్తుంటే, మరి కొందరు, వారికి సురక్షితమైన ఆశ్రయాలు కావాలని అడుగుతున్నారు. నగరాల్లో ఇప్పుడు పెద్ధవాళ్ల కోసం కొన్ని ప్రత్యేక సంస్థలు వెలుస్తున్నాయి. పెద్దవాళ్లకోసం నర్సులను ఇంటికి పంపడం, లేదా వారికి తమ సంస్థలోనే తాత్కాలిక ఆశ్రయం ఇవ్వడం ఈ సంస్థలు చేస్తున్నాయి.
చెన్నైలోని ఫ్రంట్-ఎండర్స్ హెల్త్ కేర్ కో ఫౌండర్ కృష్ణ కావ్య దీనిపై మాట్లాడుతూ, కొంతమంది పెద్దలకు బిపి, వినికిడి సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఉంటాయని, అలాంటి కుటుంబాల వారు తమ పెద్దలకోసం నిరంతరం ఒక సహాయకుడిని కోరుకుంటారని అన్నారు. కొంతమంది గుండెపోటుకి గురయి ప్రస్తుతం బాగానే ఉన్నా నిరంతరం కనిపెట్టుకుని ఉండే మనిషి కావాలని ఆశిస్తారని కావ్య అన్నారు. తమ సంస్థ నుండి శిక్షణ పొందిన వైద్య సహాయకులను అవసరం ఉన్నవారి ఇళ్లకు పంపుతున్నట్టుగా కావ్య తెలిపారు. ప్రస్తుతం 50 కుటుంబాల తాలూకూ పెద్దలకు ఇలాంటి సేవలు అందిస్తున్నామని ఆమె అన్నారు.
తాత్కాలికంగా నాలుగైదు రోజులు పెద్దవారిని సురక్షితంగా చూసుకునే ఆశ్రయం కావాలంటే దొరకటం ఇబ్బందే. కొత్తవారిని నియమించుకోవాలంటే భద్రత సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పెద్దలను సంరక్షించే సంస్థలు, నర్సులను అందించే సంస్థలు ఏర్పడటం అత్యంత అవసరంగా మారింది.
https://www.teluguglobal.com//2016/04/11/అందరూ-విహార-యాత్రలో-ఆమ/