అక్కడ భార్య పుట్టినరోజును మర్చిపోతే ఐదేళ్ళు జైలు!

2023-02-14 01:10:55.0

న్యూజీలాండ్ సమీపంలో ఉన్న సమోవా అనే దీవిలో భార్య పుట్టినరోజును మరచిపోవడం పెద్ద నేరం. దానికి కోర్టులు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇది మనకు చాలా అసాధారణంగా అనిపించినా ఈ దేశంలో ఇలాంటి కఠినమైన చట్టాలు చాలా ఉన్నాయట.

పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాలు వంటి ముఖ్యమైన ఇంటి ఈవెంట్‌లను భర్తలు మర్చిపోవడం ఇంట్లో గొడవలు జరగడం మన దేశంలో సర్వసాధారణం కదా! ఒక్కో సారి ఇది వారి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో సంబంధాలలో సమస్యలను తీసుకవస్తుంది కూడా.

అయితే, న్యూజీలాండ్ సమీపంలో ఉన్న సమోవా అనే దీవిలో భార్య పుట్టినరోజును మరచిపోవడం పెద్ద నేరం. దానికి కోర్టులు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇది మనకు చాలా అసాధారణంగా అనిపించినా ఈ దేశంలో ఇలాంటి కఠినమైన చట్టాలు చాలా ఉన్నాయట.

భర్త తన భార్య పుట్టినరోజును మరచిపోతే, ఆమె పోలీసులకు పిర్యాదు చేసిందంటే మొదటిసారి హెచ్చరించి వదిలేస్తారు. కానీ రెండోసారి కూడా జరిగితే, అతనికి జరిమానా లేదా 5 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తారు.

ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించేలా చేయడం కోస‍ం అక్కడ్ ఒక స్పెషల్ పోలీస్ టీ‍ం కూడా పనిసేస్తుందట. భార్యలనుండి పిర్యాదు రాగేనే వీళ్ళు రంగంలోకి దిగిపోతారట. అంతేకాదు స్త్రీలకు ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ టీం అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తుందట.

Beware,5 years jail,forget,birthday,wife