అక్రమ వలసదారుల రాక భారత్‌ దౌత్యానికి పరీక్ష

2025-02-15 06:18:39.0

అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి చేతులకు సంకెళ్లు, పాదాలకు తాళ్లు కట్టి ఉంటాయా అనే సందేహాలు ఉదయిస్తున్నాయని వ్యాఖ్యానించిన చిదంబరం

https://www.teluguglobal.com/h-upload/2025/02/15/1403610-chidambaram.webp

అమెరికా అక్రమ వలసదారులతో నేడు సీ 17 గ్లోబ్‌ మాస్టర్‌ 3 విమానం అమృతసర్‌ చేరుకోనున్నది. దీనిపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ ఆ విమానం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి చేతులకు సంకెళ్లు, పాదాలకు తాళ్లు కట్టి ఉంటాయా అనే సందేహాలు ఉదయిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇది భారత్‌ దౌత్యానికి ఓ పరీక్ష మారనున్నదని మాజీ కేంద్రమంత్రి పేర్కొన్నారు. 

దీనిపై మరో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా స్పందించారు. అక్రమ వలసల విషయంలో మోడీ ఒక విషయాన్ని విస్మరించారు. వలసదారులను అమర్యాదగా వెనక్కి పంపడటంపై ఆందోళననను తెలియజేసి ఉంటే బాగుండేది. అక్రమ వలస విషయంలో ఆయన వైఖరి సరైనదే. యువతను మోసగించి కొందరు అక్రమంగా దేశం దాటిస్తున్నారు. భారత్‌కు చెందన అక్రమ వలసదారులు అమెరికాలో ఉంటే వారిని కచ్చితంగా తిరిగి వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు. అయితే ప్రైవేట్‌గా జరిగిన చర్చల్లో అక్రమవలసదారుల చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేయడంపై మోడీ ఆందోళన తెలిపి ఉండాల్సింది. రక్షణ రంగం విషయానికి వస్తే ఎఫ్‌-35 యుద్ధవిమానాలను భారత్‌కు విక్రయించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఎందుకంటే అవి అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇప్పటికే మన దగ్గర రఫేల్‌ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఎఫ్‌-35 చేరికతో వాయుసేన బలం మరింత పెరుగుతుందన్నారు. 

Chidambaram on,Illegal migration,would be a “test” for Indian diplomacy,Illegally immigrated,Arrived in Amritsar