https://www.teluguglobal.com/h-upload/2024/10/16/500x300_1369429-akhanda-2.webp
2024-10-16 06:19:43.0
బాలకృష్ణ-బోయిపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ
బాలకృష్ణ-బోయిపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. బాలకృష్ణ హీరోగా బోయిపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘అఖండ 2-తాండవం’. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్రబృందంతో పాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజ్వస్విని, ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ భారీ విజయాలు సాధించాయి. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ జాబితాలో చేరింది. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా స్వీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘అఖండ 2’ అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ బోయిపాటి పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘అఖండ 2-తాండవం’ ను అనౌన్స్ చేశారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మితం కానున్న ఈ సినిమాలో ప్రగ్వాజైస్వాల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.
Balakrishna,Boyapati Srinu,Akhanda 2,Launched,pooja ceremony
https://www.teluguglobal.com//cinema-and-entertainment/akhanda-2-has-started-1071435