అగ్నివీరులకు హెయిర్‌ కటింగ్‌, బట్టలుతకడం నేర్పిస్తాం- కిషన్ రెడ్డి

2022-06-18 23:52:18.0

ఇప్పటికే అగ్నిపథ్‌పై దేశ యువత రగిలిపోతుంటే కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు మరింతగా వారిని హేళన చేసేలా, రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తమ స్కీంను సమర్థించుకునేందుకు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అగ్నిపథ్‌పై మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు అనేక అవకాశాలుంటాయని చెప్పారు. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తామన్నారు. అగ్నిపథ్‌లో చేరిన వారికి బట్టలుతకడం, క్షవరం చేయడం వంటి పనులు కూడా నేర్పుతారని.. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బతకడానికి ఆ […]

ఇప్పటికే అగ్నిపథ్‌పై దేశ యువత రగిలిపోతుంటే కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు మరింతగా వారిని హేళన చేసేలా, రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తమ స్కీంను సమర్థించుకునేందుకు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అగ్నిపథ్‌పై మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు అనేక అవకాశాలుంటాయని చెప్పారు. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తామన్నారు.

అగ్నిపథ్‌లో చేరిన వారికి బట్టలుతకడం, క్షవరం చేయడం వంటి పనులు కూడా నేర్పుతారని.. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బతకడానికి ఆ శిక్షణ పనికొస్తుందని చెప్పారు. ” అగ్నివీరులందరికి నైపుణ్యాలు నేర్పుతాం. ఇంట్రెస్‌ లేని వారు (సైనికులుగా పనిచేయడం ఇష్టం లేని వారు)అందులో పనిచేయవచ్చు. స్కిల్లింగ్‌ నేర్పడం తప్పు కాదు కదా?. మిలటరీలోనూ రకరకాల పనులుంటాయి. డ్రైవర్లు వేరు ఉంటారు, ఎలక్ట్రీషియన్లు వేరే ఉంటారు. బట్టలు ఉతికేవాళ్లు వేరే ఉంటారు. హెయిల్ కంటింగ్‌ చేసేవాళ్లూ ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులుంటాయి. కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతారు. మిలటరీ తరహాలోనే ఇక్కడా నైపుణ్యాలు నేర్పుతాం. నేర్పడం తప్పు కాదు కదా?. నేర్పకూడదని రూల్ ఉందా?.” అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి ఇలా అగ్నివీరులకు హెయిర్ కటింగ్, బట్టలుతకడం వంటివి నేర్పిస్తామని, ఆ తర్వాత అవి వారికి ఉపయోగపడుతాయన్నట్టు మాట్లాడడంపై యువత నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం పట్ల ఉన్న గౌరవం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

agnipath,Agnipath Protest,Firefighters,kishan reddy,sensational comments,Union Minister