2023-03-07 08:23:11.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/07/725912-adugu.webp
నిదురించే రేయిని అడుగు
స్వపాలను అప్పే ఇమ్మని
వికసించే కిరణాన్నడుగు
వెనుదిరగని శక్తే ఇమ్మని
కష్టించే మనిషిని అడుగు
సౌందర్యం మర్మం ఏదని
కదిలించే దృశ్యాన్నడుగు
విరితోటల వేణువు ఏదని
నిలదీసే నిజాన్ని అడుగు
దారెందుకు మరిచావంటూ
గతితప్పిన మనిషిని అడుగు
గల్లంతై పోయావెందుకని
బతిమాలే బతుకును అడుగు
నడకెందుకు మార్చావంటూ
బలవంతునిదో మాటల గారడి
బలహీనుడి బతుకే కార్చిచ్చు.
రేపేమో ఆశల దీపం
నేడేమో నీరస శస్త్రం
దిగులంతా దేవుడి కొదిలి
మనసే ఇక శుభ్రం చేసేయ్
-సి. యస్. రాంబాబు
CS Rambabu,Telugu Kavithalu