2023-01-03 07:01:33.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/03/433698-athadu-manisha.webp
ఒకడు ఉంటాడు …..
ఉదయాల్ని వెలిగిస్తూ
ప్రభాకిరణమై ప్రకాశిస్తూ !
ఒకడు ఉంటాడు …..
రాత్రి చీకట్లలో రెక్క విప్పిన
వెన్నెల దీపమై విప్పారుతూ !
ఒకడు ఉంటాడు …..
సమూహంలో దారి చూపే
దీప స్తంభమై !
ఒకడు ఉంటాడు …..
హృదయం విప్పి మాట్లాడుతూ
హృదయాల్ని స్పృశిస్తూ !
ఒకడు ఉంటాడు …..
సహానుభూతిని ప్రకటిస్తూ
కన్నీళ్ళని తుడుస్తూ !
ఒకడు ఉంటాడు …..
పథాన్ని నిర్దేశిస్తూ
అనుక్షణం ఆలంబనమై
అల్లుకుపోతూ !
అతడు …. మనిషి !
– డా . రవూఫ్
Athadu manishi,Telugu Kavithalu,Dr Raoof