http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/mobile-useage.gif
2016-06-23 01:03:54.0
స్మార్ట్ ఫోన్ సన్నిధి…అదే మాకు పెన్నిధి…అని పాడుకుంటున్నారు ఆధునికులు. తమతో ఎవరున్నా లేకపోయినా స్మార్ట్ఫోన్ మాత్రం ఉండాల్సిందేనని చాలామంది తేల్చిచెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ విరహాన్ని మగవారయితే ఏ మాత్రం భరించలేకపోతున్నారట. జర్మనీలోని వ్యూయర్ బర్గ్, ఇంగ్లండులోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మగవారు సగటున స్మార్ట్ ఫోన్ లేకుండా 21 సెనక్లు కూడా ఉండలేకపోతున్నారని, ఆడవారు ఈ విషయంలో కాస్త మెరుగ్గా… సగటున 57 సెకన్ల వరకు ఫోన్‌కి దూరంగా […]
స్మార్ట్ ఫోన్ సన్నిధి…అదే మాకు పెన్నిధి…అని పాడుకుంటున్నారు ఆధునికులు. తమతో ఎవరున్నా లేకపోయినా స్మార్ట్ఫోన్ మాత్రం ఉండాల్సిందేనని చాలామంది తేల్చిచెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ విరహాన్ని మగవారయితే ఏ మాత్రం భరించలేకపోతున్నారట. జర్మనీలోని వ్యూయర్ బర్గ్, ఇంగ్లండులోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మగవారు సగటున స్మార్ట్ ఫోన్ లేకుండా 21 సెనక్లు కూడా ఉండలేకపోతున్నారని, ఆడవారు ఈ విషయంలో కాస్త మెరుగ్గా… సగటున 57 సెకన్ల వరకు ఫోన్‌కి దూరంగా ఉండగలుగుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. స్మార్ట్ఫోన్ సిత్రాలను ఏమని చెబుతాం…ఒక్కమాటలో చెప్పాలంటే అది చేతిలో ఉన్నపుడు మనతో మనం ఉండలేము…ఇతరులతోనూ ఉండలేము…మరి అంత సమయం ఎటుపోతుందో వాడేవారే తేల్చుకోవాలి.
https://www.teluguglobal.com//2016/06/23/అతను-21-సెకన్లయినా-ఆగలే/