అతివేగం.. ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం

2024-07-27 12:43:04.0

మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వ‌య‌సు వారే.

https://www.teluguglobal.com/h-upload/2024/07/27/1347661-5-children-among-8-killed-after-car-falls-into-gorge-in-jammu-and-kashmir-anantnag.webp

జ‌మ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణం తీసింది. డుక్సుమ్‌ అనే ప్రాంతం దగ్గర వేగంగా వెళ్తున్న ఓ టాటా సుమో స్కిడ్‌ అయి లోయలోకి దూసుకెళ్లింది. పల్టీలు కొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. దీంతో 8 మంది స్పాట్‌లోనే మృతిచెందారు.

మృతులంతా కిష్టవార్‌ జిల్లాకు చెందివారు. తమ స్వ‌స్థ‌లానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వ‌య‌సు వారే. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రమాదంలో చనిపోవడంతో వారి బంధువులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

5 children,8 killed,Car,Falls,Gorge,Jammu and Kashmir,Anantnag