2024-10-12 10:38:46.0
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368426-kharge.webp
కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉగ్రవాదుల పార్టీ అని.. దానిని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని.. ప్రమాదకరమైన ఆ పార్టీ ఎజెండాను ప్రజలు పసిగట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ప్రతిసారి ఇలాగే తప్పుడు ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అలా బురద చల్లడం మోదీకి అలవాటు అన్నారు. ఆయన ఉన్నది హంతకుల పార్టీ అని.. ఎన్నో హత్యలపై ఆ పార్టీకి సంబంధముందని అన్నారు. అలాంటి పార్టీలో ఉండి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
PM Narendra Modi,AICC Chief Mallikarjuna Kharge,urban naxals,bjp murders party,Haryana,Maharastra