అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం.. ఇదెక్కడి ఘోరం..

2022-06-15 01:42:26.0

ఉత్తరాదిలో నాయకుడికి ఎలాంటి అలవాట్లు ఉన్నా, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ముసిరినా.. అభిమానులకు ఆయన ఎప్పుడూ హీరోనే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అలవాటు లేదు. కానీ ఇప్పుడు హత్య కేసులో ప్రధాన ముద్దాయి, తనకు తానుగా హత్య చేసినట్టు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం అది తప్పు అని రుజువు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఎమ్మెల్సీ అనంత బాబు ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై అభిమానం చూపించినా ఓ లెక్క, […]

ఉత్తరాదిలో నాయకుడికి ఎలాంటి అలవాట్లు ఉన్నా, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ముసిరినా.. అభిమానులకు ఆయన ఎప్పుడూ హీరోనే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అలవాటు లేదు. కానీ ఇప్పుడు హత్య కేసులో ప్రధాన ముద్దాయి, తనకు తానుగా హత్య చేసినట్టు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం అది తప్పు అని రుజువు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఎమ్మెల్సీ అనంత బాబు ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేస్తున్నారు.

ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై అభిమానం చూపించినా ఓ లెక్క, కానీ ఇక్కడ అనంతబాబు తనకు తానే తన డ్రైవర్ ని కొట్టి చంపానంటూ పోలీసుల ముందు ఒప్పుకుని లొంగిపోయారు. ఆయనకు బెయిలు దొరికే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు సడన్ గా ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేసరికి అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.

పార్టీ బహిష్కరించినా..

ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పై వైసీపీ బహిష్కరణ వేటు వేసింది. ఆయన్ను ఎమ్మెల్సీగా అనర్హుడిగా పరిగణించాలంటూ ప్రతిపక్ష టీడీపీ మండలి ఛైర్మన్ ను కలసి విజ్ఞప్తి చేసింది. ఈ దశలో కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీలో ఉన్న అనంతబాబు అభిమానులు.. ఇలా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ పాలాభిషేకాలు జరిగాయని అంటున్నారు. ఎమ్మెల్సీని వైసీపీనుంచి సస్పెండ్ చేసినా, ఆపార్టీ నేతలు ఇంకా ఆయనకు పాలాభిషేకాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. అనంతబాబు డ్రైవర్ హత్య వ్యవహారం ఇంకా వేడిగానే ఉంది. ఈ దశలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడంతో కలకలం రేగింది.

 

Anantha Babu,flexi,Milk Bath,Suspended Mlc,ycp