అన్ని స్కూల్లో తెలుగు తప్పనిసరి..ప్రభుత్వం ఉత్తర్వులు

2025-02-25 15:11:57.0

తెలంగాణలోని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది. తొమ్మిదో తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది.

పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. (సింగిడి స్టాండర్ట్ తెలుగు స్థానంలో సులభతరం తెలుగు వాచక వెన్నెలను 9,10 వ తరగతుల్లో బోధించాలని స్ఫష్టం చేసింది. ఈ సింపుల్ తెలుగును అమలు చేయడం వల్ల.. తెలుగు నేర్చుకోవాలి అనుకునేవాళ్లకు.. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్లకు ఎంతగానో సులువు కానుంది.

Telugu subject,CBSE,ICSE,IB,Telangana Goverment,CM Revanth reddy,Department of Education,CS Shanthikumari