https://www.teluguglobal.com/h-upload/2022/08/13/500x300_369714-cigarette.webp
2022-08-13 05:53:03.0
భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా తాగటం వలన ఒక సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుంది.
భోజనం చేయగానే నిద్రపోవటం, లేదా పళ్లు తినటం, సిగరెట్ తాగటం లాంటి అలవాట్లను మనం చాలామందిలో చూస్తుంటాం. అయితే ఇలా చేయటం మంచిదేనా. భోజనం చేయగానే ఆచరించే కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి… ఈ అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం…
♦ చాలామంది భోజనం చేసినవెంటనే పళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయటం మంచిది కాదట. పళ్లను భోజనానికి గంట ముందు లేదా భోజనం చేశాక రెండుగంటల తరువాత తినవచ్చు. పళ్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. అయితే భోజనం చేసిన వెంటనే వాటిని తింటే అవి సరిగ్గా విచ్ఛిన్నం కావని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
♦ అన్నం తినగానే స్నానం చేయటం కూడా మంచిది కాదు. దీనివలన జీర్ణశక్తి నెమ్మదిస్తుంది. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియకి దోహదం చేయాల్సిన రక్తం పొట్ట ప్రాంతంలో ఉండకుండా… శరీరమంతా వెళ్లాల్సి వస్తుంది. దాంతో మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
♦ భోజనం చేయగానే టీ తాగుతుంటారు కొందరు. కానీ ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే టీ ఆకులు ఎసిడిటీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనివలన ఈ ఆకులు జీర్ణక్రియకు ఆటంకంగా మారతాయి. ముఖ్యంగా ప్రొటీన్ ని జీర్ణం కాకుండా అడ్డుకుంటాయి. అలాగే భోజనం తరువాత టీ తాగితే ఇనుము శోషణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. భోజనానికి గంట ముందు, లేదా రెండు గంటల తరువాతే టీ తాగటం మంచిది.
♦ భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా తాగటం వలన ఒక సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుంది. అంతగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పేగులపై అది ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి… భోజనం తరువాత సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు దానిని మానేయటం మంచిది.
♦ మధ్యాహ్న భోజనం అవగానే కాసేపు కునుకు తీయటం చాలామందికి అలవాటు. కానీ ఇలా చేసినప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపునిండా తిన్నపుడు తప్పకుండా కొంత సమయం మేలుకుని ఉండాలి.
Cigarette,Sleeping after Eating
cigarette, Sleeping after Eating, Sleeping, Eating, health, health tips, telugu news, telugu latest news, telugu global news, one cigarette is equal to ten cigarettes
https://www.teluguglobal.com//health-life-style/then-one-cigarette-is-equal-to-ten-cigarettes-327734