అప్పుడే పుట్టిన చిన్నారికి సీపీఆర్‌ చేసి కాపాడిన 108 సిబ్బంది

2025-01-18 06:43:17.0

నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి గుండె..సీపీఆర్‌ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన పైలట్‌ నవీన్‌, ఈఎంటీ రాజు

అప్పుడే పుట్టిన చిన్నారికి సీపీఆర్‌ చేసి 108 సిబ్బంది కాపాడారు. మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన చిన్నారికి శ్వాస అందలేదు. దీంతో చిన్నారిని హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి గుండె ఆగింది. వెంటన్‌ 108 సిబ్బంది స్పందించి సీపీఆర్‌ చేశారు. పైలట్‌ నవీన్‌, ఈఎంటీ రాజు సీపీఆర్‌ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు. 

Quick CPR by 108 team,Saves newborn baby’s life,In Telangana,Niloufer Hospital