అప్సా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి నోటీసులు

2024-09-26 07:26:02.0

ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ అందులో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం

https://www.teluguglobal.com/h-upload/2024/09/26/1363236-telugu-global-breaking-news.webp

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ అందులో పేర్కొన్నది. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీస్‌ బేరర్లు సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారు వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోద్దని విజ్ఞప్తి చేశారు.