అభివృద్ధి, సుపరిపాలనదే విజయం

2024-11-23 12:40:14.0

మహారాష్ట్రలో ఘన విజయంపై ప్రధాని నరేంద్రమోదీ

https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380343-narendra-modi.webp

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయంపై ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని పేర్కొన్నారు. కలిసికట్టుగా పని చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని అన్నారు. ఇంతటి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై వాళ్లు చూపించిన ప్రేమ అసమానమైనదని, మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కృషి చేస్తుందని తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పని చేసిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనను కార్యకర్తలు ప్రజలకు వివరించారని, వారి కృషితోనే ఘన విజయం సాధించామన్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన జేఎంఎం కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.

Maharashtra,Assembly Elections,Mahayuti,Grand Victory,PM Narendra Modi