అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

2024-10-24 11:08:00.0

అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.

https://www.teluguglobal.com/h-upload/2024/10/24/1372103-cm-cbn.webp

అమరావతి రైల్వే లైన్‌కు కేేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్, కోల్ కతా, చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మించనున్నారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం చేయనున్నారు.

ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..నూతన రైల్వేలైన్‌ ఏర్పాటుతో అమరావతి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందన్నారు. విశాఖ రైల్వే జోన్‌ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూసేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతికి 57 కి.మీ.ల మేర కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.