https://www.teluguglobal.com/h-upload/2023/09/26/500x300_831041-amazon-great-indian-sale.webp
2023-09-26 10:59:58.0
అక్టోబర్‌లో రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కామర్స్ సైట్లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించగా తాజాగా అమెజాన్ కూడా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ ను ప్రకటించింది.
అక్టోబర్‌లో రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కామర్స్ సైట్లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించగా తాజాగా అమెజాన్ కూడా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ ను ప్రకటించింది. అమెజాన్ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ఉన్నాయంటే..
రీసెంట్‌గా అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌కు సంబంధించిన మైక్రో సైట్‌ను లాంఛ్ చేసింది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సేల్ అక్టోబర్ 11న ప్రారంభమై అక్టోబర్ 18 వరకు ఉండొచ్చని అంచనా. అయితే అమెజాన్ ఇప్పటికే కొన్ని డీల్స్ గురించిన హింట్స్ ఇచ్చింది.సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.
సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, క్లాతింగ్, స్మార్ట్ టీవీలు వంటి ప్రొడక్ట్స్‌పై పలు డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు అదనంగా పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, వన్‌ప్లస్ 11, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ , రియల్‌మీ నార్జో, ఐకూ జెడ్7 ప్రో, హానర్ 90 మోడల్స్‌పై మంచి ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ముందుగా మొదలయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్.. ఆఫర్లలో మార్పులు చేయొచ్చు. మరిన్ని మంచి డీల్స్ తీసుకురావొచ్చు.
Amazon Great Indian Festival Sale,Amazon,Mobiles,Deals,Flipkart Big Billion Days
Amazon Great Indian Festival Sale, Amazon, Amazon sale, Deals on Mobiles, Deals
https://www.teluguglobal.com//business/amazon-great-indian-festival-sale-2023-deals-on-mobiles-expected-963933