https://www.teluguglobal.com/h-upload/2023/08/07/500x300_806513-amazon-great-freedom.webp
2023-08-07 10:10:29.0
ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ మొదలైంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ మొదలైంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటిలో కొన్ని బెస్ట్ డీల్స్ గమనిస్తే..
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఫెస్టివల్ సేల్ లో భాగంగా శాంసంగ్, ఒప్పో వంటి కొన్ని లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఐఫోన్‌పై కూడా తగ్గింపు లభిస్తుంది. వాటి వివరాలివి..
ఐఫోన్ 14
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే లభిస్తుంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌తో కూడిన ఈ ఫోన్.. కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి లేటెస్ట్ ఫీచర్‌లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర లాంఛ్ అయినప్పుడు రూ. 79,900 ఉంది. ఇప్పుడు దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే అదనంగా మరో వెయ్యి రూపాయల తగ్గింపు లభిస్తుంది.
ఐకూ 9 5జీ
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ లో భాగంగా ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రూ.29,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990 ఉండగా.. సేల్‌లో తగ్గింపు ధరతో లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ మొబైల్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ
లాంచింగ్ ధర రూ.18,999 గా ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ మొబైల్ ఇప్పుడు సేల్‌లో భాగంగా రూ.16,999కే లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
షావోమీ 12 ప్రో 5జీ
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా షావోమీ 12 ప్రో 5జీ రూ. 41,999లకే లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో వచ్చే ఈ మొబైల్ అసలు ధర రూ.62,999 ఉండగా సేల్‌లో రూ.52,999లకు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో మరో రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Amazon Great Freedom Festival,Amazon,Smartphone,Discounts
Amazon Great Freedom Festival, Amazon, Great Freedom Festival, Amazon Great Freedom Festival 2023, phones, smartphone, Discounts
https://www.teluguglobal.com//business/amazon-great-freedom-festival-huge-discounts-on-these-phones-953373