2024-08-07 19:58:57.0
ఈ నెలలో రాబోయే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇకామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ ను అనౌన్స్ చేసింది.
ఈ నెలలో రాబోయే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇకామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ లో కొన్ని మొబైల్స్‌పై ఇంట్రెస్టింగ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌తోపాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మేషిన్లు, స్మార్ట్ వాచీలు.. ఇలా రకరకాల గ్యాడ్జెట్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. సేల్ డిస్కౌంట్‌తోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్లో ఐ-ఫోన్, వన్‌ప్లస్, శాంసంగ్, ఐకూ వంటి బ్రాండెడ్ ఫోన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 13 అసలు ధర రూ. 79,900కాగా సేల్ లో రూ.47,900 కే లభిస్తుంది. ఐకూ జెడ్ 9 లైట్ అసలు ధర రూ.14,499 ఉండగా సేల్‌లో రూ.9,999 కే లభిస్తుంది. సేల్‌లో బిగ్గెస్ట్ డీల్ ఇదే. అలాగే రూ.13,999 ఉన్న రెడ్మీ 13సీ రూ.9499 లకు లభిస్తుంది. హానర్ 200 5జీ (12 జీబీ +512 జీబీ)వేరియంట్ ధర రూ.39,999 కాగా సేల్ లో రూ.29,999కే లభిస్తుంది. రీసెంట్గా లాంఛ్ అయిన రియల్మీ నార్జో ఎన్61 (6జీబీ+ 128 జీబీ) వేరియంట్ లాంఛింగ్ ధర రూ.8,499 ఉండగా సేల్‌లో రూ.6,999 కే లభిస్తుంది.
వీటితోపాటు వన్‌ప్లస్12 ఆర్ రూ. 39,999(అసలు ధర రూ.42,999), ఐక్యూ నియో9 ప్రో రూ. 31,999(అసలు ధర రూ.39,999), – వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ రూ. 27,999(అసలు ధర రూ.29,999) రియల్మీ జీటీ 6టీ రూ.25,999(అసలు ధర రూ.30,999), శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రూ. 24,999(అసలు ధర రూ.49,999), ఐకూ జెడ్9 రూ.16,999(అసలు ధర రూ.19,999), లావా బ్లేజ్ ఎక్స్ రూ.13,249(అసలు ధర రూ.16,999)లకు లభిస్తున్నాయి.
Amazon Great Freedom Festival,Amazon sale,Amazon Great Freedom Festival 2024 Sale,Amazon Offers,Amazon