https://www.teluguglobal.com/h-upload/2024/11/30/1382175-saiteja.webp
2024-11-30 05:33:32.0
చికాగోలో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సాయితేజ
అమెరికాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు. చికాగోలో దుండగుల కాల్పుల్లో సాయితేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల కిందటే అమెరికాకు వెళ్లాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం లేదు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్త తెలిసిన తర్వాత సాయితేజ ఫ్యామిలీ దిగ్భ్రాంతికి లోనైంది. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్న ఈ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంపై వాళ్లు వాపోతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అక్కడి తెలుగు సంఘాలను కోరుతున్నారు. మరోవైపు రామన్నపేటలోని సాయితేజ ఇంటికి వాళ్ల బంధువులు, స్నేహితులు చేరుకుని ఆయన కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు.
Firing in America,Resident of Khammam district,killed,Nukarapu Saiteja