అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ యువకుడు మృతి

2025-01-29 14:10:34.0

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఖైరతాబాద్‌ ఎం.ఎస్‌ మక్తాకు చెందిన మహమ్మద్‌ వాజిద్‌ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికావెళ్లాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాజిద్‌ సొంత శక్తితో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూనే విద్యాభ్యాసం కొనసాగించాడు.

గతంలో కాంగ్రెస్‌పార్టీ ఖైరతాబాద్‌ డివిజన్‌ యువజ నాయకుడిగా కూడా పని చేశాడు. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ మైనారిటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం చికాగాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్‌ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. రాజ్యసభ ఎంపీ అనిల్‌ కుమార్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Road accident,America,Mohammed Wajid,Hyderabad,Khairatabad,MS Makta,NRI Congress,Chicago,MP Anil Kumar,CM Revanth reddy,Congress Party,Feroze Khan