అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసుల మృతి

2025-03-17 05:07:26.0

మాజీ సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి కుమార్తె కుటుంబీకులుగా గుర్తింపు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి కుమార్తె కుటుంబీకులుగా గుర్తించారు. మృతులను ప్రగతి రెడ్డి, ఆమె కుమారుడు అరవింద్‌, అత్త సునీతగా గుర్తించారు. ప్రణీత రెడ్డి భర్త రోహిత్‌ రెడ్డి కారు నడుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రోహిత్‌ రెడ్డి, ఆయన చిన్నకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయలుదేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.