అమ్మకంటే ..! గజల్

2023-06-30 11:47:30.0

https://www.teluguglobal.com/h-upload/2023/06/30/789963-ammakante.webp

అమ్మ ఇవ్వని దేమివున్నది

శిశువుకోసం

ఊపిరిచ్చును

ఎదుగుదలలో హద్దుమీరిన ఎంతకఠినపు దండనిచ్చును

మనసులోనిది చెప్పుకోగల దోస్తులెవరోయ్ అమ్మకంటే

యవ్వనములో ఇష్టమైనది

అందుకొనగా

స్నేహమిచ్చును

గెలుపులోనిక దిష్టి తీసే

అమాయకమే అమ్మలోనా

ఓటమెరిగిన ఘడియలోనే

అంతులేనిది ఊరటిచ్చును

మాతృదేవత పూజలేనిది

నిరాడంబర స్వచ్చహాసమె

కడుపుతీపిని మరువలేమిక గడ్డుసమయం ప్రాణమిచ్చును

తండ్రివున్నా లేకపోయిన

అమ్మ పాత్రలు అద్వితీయo

తెలుసుకో ఉమ

సంతుకోసం సర్వశక్తులు

దానమిచ్చును!!

-ఎం. వి. ఉమాదేవి

(నెల్లూరు)

MV Umadevi,Telugu Ghazals