https://www.teluguglobal.com/h-upload/2024/04/07/1316955-mangalsutra.webp
2024-04-07 12:56:24.0
ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు. గర్భగుడిలో అపుడు ఎవరూ లేరు. చుట్టపక్కల చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగిలించాడు.
ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి ఎంతకైనా తెగిస్తున్నారు.దొంగతనం చేయటం వల్ల తర్వాత ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించకుండా చోరీలు చేసి చిక్కుల్లో పడుతున్నారు.తాజాగా అమ్మవారి మేడలో మంగళసూత్రం దొంగిలించిన ఘటన ఏపీలో జరిగింది. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు. గర్భగుడిలో అపుడు ఎవరూ లేరు. చుట్టపక్కల చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగిలించాడు. ఏమీ ఎరగనట్లుగా దాన్ని జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఎప్పటిలాగే పూజ చేసేందుకు వచ్చిన పూజారి అమ్మవారి మెడలో మంగళసూత్రం లేనిది చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఓ దుండగుడు అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించి జేబులో వేసుకుని అక్కడినుంచి జారుకున్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Eluru,stolen,Saubhagyalakshmi temple,eluru Saubhagyalakshmi temple,theft in temple,Ammas mangalsutra stolen