2023-12-13 09:52:45.0
శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళ్తారు. కొందరు సివిల్లో కూడా శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో మొత్తం 51 స్పెషల్ ట్రైన్లు నడువనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
శబరిమలకు వెళ్లే స్పెషల్ ట్రైన్ల వివరాలు..
డిసెంబర్ 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సికింద్రాబాద్- కొల్లాం (07111)
డిసెంబర్ 29, జనవరి 5, 12, 19 తేదీల్లో కొల్లాం- సికింద్రాబాద్ (07112)
డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో కాకినాడ టౌన్- కొట్టాయం (07113)
డిసెంబర్ 30, జనవరి 6, 13, 20 తేదీల్లో కొట్టాయం-కాకినాడ టౌన్ (07114)
జనవరి 2న సికింద్రాబాద్- కొట్టాయం (07117)
జనవరి 4న కొట్టాయం-సికింద్రాబాద్ (07118)
జనవరి 6, 13 తేదీల్లో సికింద్రాబాద్ -కొట్టాయం (07009)
జనవరి 8, 15 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్ (07010)
శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళ్తారు. కొందరు సివిల్లో కూడా శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. పెద్దసంఖ్యలో ఉండే అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకుని శబరిమలకు స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. అధికారుల నిర్ణయంపై అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
South Central Railway,Announces,Special trains,Sabarimala,AP,Telangana,Ayyappa devotees