2016-04-20 06:41:48.0
థానేలో ఫన్‌గణే అనే ప్రాంతంలో ఒక స్కూలుంది. అందులో చేరలాంటే కనీసం 60 సంవత్సరాల వయసుండాలి. అరవై నుండి 90 ఏళ్ల మధ్య వయసున్న మహిళలంతా ఆ స్కూల్లో చేరడానికి అర్హులే. దానిపేరు బామ్మల బడి. మోతీరామ్ దలాల్ ట్రస్ట్ ఈ స్కూలుని స్థాపించింది. భారతదేశంలోనే నిరక్ష్యరాస్యులైన బామ్మలకోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్కూలు ఇది. పెద్దవారిపట్ల ప్రేమ, గౌరవం పెంచడానికే తాము బామ్మల బడిని స్థాపించామని ట్రస్ట్ స్థాపకుడు దిలీప్ దలాల్ అంటున్నాడు. గ్రామంలోని ప్రతిఒక్కరూ […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/school.gif
థానేలో ఫన్‌గణే అనే ప్రాంతంలో ఒక స్కూలుంది. అందులో చేరలాంటే కనీసం 60 సంవత్సరాల వయసుండాలి. అరవై నుండి 90 ఏళ్ల మధ్య వయసున్న మహిళలంతా ఆ స్కూల్లో చేరడానికి అర్హులే. దానిపేరు బామ్మల బడి. మోతీరామ్ దలాల్ ట్రస్ట్ ఈ స్కూలుని స్థాపించింది. భారతదేశంలోనే నిరక్ష్యరాస్యులైన బామ్మలకోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్కూలు ఇది. పెద్దవారిపట్ల ప్రేమ, గౌరవం పెంచడానికే తాము బామ్మల బడిని స్థాపించామని ట్రస్ట్ స్థాపకుడు దిలీప్ దలాల్ అంటున్నాడు.
గ్రామంలోని ప్రతిఒక్కరూ తమని ప్రోత్సహిస్తున్నారని, ఏ ఒక్కరూ దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదని ఈ సరికొత్త ఆలోచన చేసిన యోగేంద్ర బంగార్ అన్నారు. ఈ స్కూలుకి డ్రస్ కోడ్ పింక్‌చీరలు. మొత్తం 28మంది మహిళలు ఇందులో చదువుకుంటున్నారు. జీవితంలో మొదటిసారి బడికి వస్తున్న వీరంతా చాలా ఆనందంగా ఉన్నారు. పండువయసులో ఉన్న తాను మరో లోకానికి నాలుగు అక్షరాలు తీసుకువెళతానని రమా బాయి అనే మహిళ చెబుతుంటే, తన మనుమలు, మనుమరాళ్లతో కలిసి చదువుకోవటం చాలా సరదాగా ఆనందంగా ఉందని, అక్షరాస్యులుగా మారటం కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని కాంతాబాయి చెబుతున్నారు. బామ్మల బడి ద్వారా వారి జీవితాల్లో హుషారుని, సంతోషాన్ని తేవడమే కాకుండా నూరుశాతం అక్షరాస్యతకు ఇది దోహదం చేస్తుందని స్కూలు నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఈ మహిళలకు చదువుతో పాటు పేపరుబ్యాగుల తయారీ, చేత్తో నూలు వడకటం కూడా నేర్పుతున్నారు.