అరాచక పోస్టులు పెట్టే వారి అంతుచూడాలి

2024-11-07 13:00:03.0

కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ షర్మిల విజ్ఞప్తి

https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375720-sharmila-ys.jfif

సోషల్‌ మీడియాలో అరాచక పోస్టులు పెట్టే వాళ్లు ఏ పార్టీ వారైనా వాళ్ల అంతు చూడాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సోషల్‌ మీడియాలో మరోసారి వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా నిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నానని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. తనతో పాటు తన తల్లి, సోదరి సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని, తాను వైఎస్‌ఆర్‌ కు పుట్టలేదని అవమానించారని.. తన ఇంటి పేరు మార్చి శునకానందం పొందారని పేర్కొన్నారు. తనపై అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌ రెడ్డిపై కేసు పెట్టానని, అలాంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టి వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్‌ సైకోల బాధితుల్లో తాను ఒకరినని ఆవేదన వ్యక్తం చేశారు.