అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌

 

2024-10-01 03:59:14.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/01/1364801-rajinikanth.webp

తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాల వెల్లడి

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సోమవారం అర్ధరాత్రి చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన కడుపునొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇవాళ ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయయనున్నారు. ఈక్రమంలో ఎలెక్టివ్‌ ప్రొసీజర్‌ ట్రీట్మెంట్‌ ఆయనకు అందించనున్నట్లు సమాచారం. గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా చేయనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన సతీమణి లతా రజనీకాంత్‌ దీనిపై స్పందిస్తూ.. రొటీన్‌ చెకప్‌ కోసమే రజనీ ఆస్పత్రిలో చేరారని అభిమానులు ఆందోళన చెందవద్దని వెల్లడించారు.రజనీ ప్రస్తుతం వేట్టయాన్‌, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానున్నది.

 

Rajinikanth,Admitted,Hospital,In Chennai