అర్ధరాత్రి 36 కార్ల అద్దాలు ధ్వంసం.. ఇది చేసిందెవరో తెలుసుకొని షాక్..!

2022-06-18 02:10:04.0

అది జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా ప్రాంతం. శుక్రవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. బాగా గమనిస్తే కార్ల అద్దాలు ధ్వంసమవుతున్న సౌండ్ వినిపించింది. అలాగే ఇళ్ల కిటికీలు పగులుతున్న శబ్దం కూడా వినిపించింది. బయటికొచ్చి చూస్తే మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఇలా గుమ్లా ప్రాంతంలోని ప్రతి వీధిలో కార్ల అద్దాలు ధ్వంసం అవుతున్న శబ్దం స్థానికులకు వినిపించింది. అయితే […]

అది జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా ప్రాంతం. శుక్రవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. బాగా గమనిస్తే కార్ల అద్దాలు ధ్వంసమవుతున్న సౌండ్ వినిపించింది. అలాగే ఇళ్ల కిటికీలు పగులుతున్న శబ్దం కూడా వినిపించింది. బయటికొచ్చి చూస్తే మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఇలా గుమ్లా ప్రాంతంలోని ప్రతి వీధిలో కార్ల అద్దాలు ధ్వంసం అవుతున్న శబ్దం స్థానికులకు వినిపించింది. అయితే కార్ల అద్దాలు పగులగొట్టే వ్యక్తి మాత్రం వారికి కనిపించలేదు.

భయాందోళన చెందిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు గుమ్లా పట్టణమంతా గాలించగా ఒక 13 ఏళ్ల బాలుడు ఈ పనికి పాల్పడినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు రాత్రి రెండుగంటల సమయంలో వీధుల్లో తిరుగుతూ చేతికందిన రాళ్లను కార్లవైపు, ఇళ్లవైపు విసురుతూ పట్టణమంతా తిరిగాడు. అతడు విసిరిన రాళ్లకు 36 కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురి ఇళ్లలో రాళ్లు పడ్డాయి.

13 ఏళ్ల బాలుడు వీధుల్లో తిరుగుతూ కార్లను పగలగొట్టే దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు రాగా అవి వైరల్ గా మారాయి. ఆ వీడియోలో బాలుడు రాళ్లను తీసుకోని కార్లపై విసురుతూ పట్టణమంతా తిరగడం కనిపించింది. అంత చిన్న పిల్లవాడు అన్ని కార్లు ఎలా పగలగొట్టాడా..అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే బాలుడికి మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తించాడని పోలీసులు భావిస్తున్నారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు వారు వెల్లడించారు. బాలుడి చర్యల కారణంగా గుమ్లా ప్రాంత ప్రజలు అర్ధరాత్రి బయట ఏం జరుగుతుందో తెలియక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

 

కార్ల అద్దాలు,జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా,పలువురి ఇళ్లలో రాళ్లు