https://www.teluguglobal.com/h-upload/2023/08/28/500x300_816668-aloe-vera.webp
2023-08-28 08:33:21.0
అలోవెరా.. దీనినే మనం కలబంద అంటాం. ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన మొక్క ఇది. దీంట్లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
అలోవెరా.. దీనినే మనం కలబంద అంటాం. ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన మొక్క ఇది. దీంట్లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ముఖంపై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను పోగొట్టడంలో అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా వాడుతుంటారు.
అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. ఎండకు చర్మం మండినా, కందిపోయినట్లు అనిపించినా వెంటనే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. అలాగే పదే పదే చేస్తే అందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగోడుతుంది. అలాగే స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని 5నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే సబ్బుతో అవసరం లేకుండానే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోయి చర్మం కోమలంగా మారుతుంది.
మేకప్ రిమూవింగ్ క్రీమ్‌లాగా, టీనేజర్లను వేధించే మొటిమలకు వేసే ఆయింట్మెంట్ లాగ కూడా పని చేస్తుంది.
అలాగే తలలో చుండ్రు ఉండి, జుట్టు మూలాల్లో ఎప్పుడూ దురద ఉంటే కూడా అలోవెరా జెల్‌ను ఉపయోగించాలి. ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది అన్ని రకాల వాపులను కూడా తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యవంతంగా మార్చుతుంది.

జుట్టు నుండి అదనపు నూనెను తగ్గిస్తుంది. సరైన పోషకాహారాన్ని అందించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది,దీని వల్ల మన జుట్టు సిల్కీగా, మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం.. ఈ టిప్స్ పాటించి మీ ముఖాన్ని, చర్మాన్ని చాలా అందంగా మార్చుకోండి.
Aloe Vera,Hair,Beauty,Health Tips
Aloe Vera, Aloe Vera for health, hair, Beauty Benefits, Beauty, Health, Health Tips, News, Telugu News, Telugu Global News, Latest Telugu News, అలోవెరా, కలబంద, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్
https://www.teluguglobal.com//health-life-style/beauty-benefits-of-aloe-vera-gel-957830