అల్లు అర్జున్‌కిి మళ్లీ పోలీసుల నోటీసులు

 

2025-01-05 05:00:48.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/05/1391697-allu-arujan.webp

అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు వెళ్లారు. శ్రీ తేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు బన్నీ నివాసం వద్దకు పోలీసులు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. కోర్టు ఆదేశాల మేరకు కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లాల్సి ఉంది. అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చిరు. బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతకుముందు నోటీసులు ఎందుకు అని మేనేజర్ ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా కలుద్దామని వచ్చినట్లు సమాధానం చెప్పకుండా ఎస్ఐ దాటవేసినట్లు సమాచారం.

కాగా, ఇటీవలే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

 

Allu Arjun,Shri Tej,Kim’s Hospital,Chikkadapally Police,Jubilee Hills,Ramgopal Peta Police,Sandhya Theatre,Nampally Criminal Court,pushpa2 movie,Regular bail,Tollywood