అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు

https://www.teluguglobal.com/h-upload/2025/01/06/1391965-allu-arjun.webp

2025-01-06 08:52:31.0

బెయిల్‌ షరతులు తప్పనిసరిగా పాటించాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు

సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. కిమ్స్‌ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్‌ రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి రావొద్దని అందులో పేర్కొన్నారు. ఆస్పత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు. బెయిల్‌ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. 

Allu Arjun,Served Police Notices,After Planned Visit to KIMS Hospital,Permission for the visit,Sandhya theatre stampede case