అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట

2024-11-06 10:10:04.0

నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375316-allu-arjun.webp

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనను చూడటానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ నంద్యాల రూరల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ రామచంద్రరావు ఈ ఏడాది మే 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్‌, రవిచంద్ర కిశోర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీన్నిసవాల్‌ చేస్తూ ఇటీవల అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నంద్యాల పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేసింది.