2024-12-05 13:29:04.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/05/1383600-bunny.webp
పుష్ప-2 బెనిఫిట్ షో తొక్కిసలాటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్ సంధ్య థియేటర్‌లో నిన్న రాత్రి పుష్ప-2 బెనిఫిట్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 105, 118 బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. బన్నీ సినిమా థియేటర్ వస్తున్న సమయంలో భద్రతపై థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో సినిమా హాల్ యాజమాన్యం నిరక్ష్యం వహించారని ఆయన టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ పేర్కొన్నారు.
Allu Arjun,Pushpa-2 Benefit Show,Revathi,Sandhya Theatre,Durgabai Deshmukh Hospital,Chikkadapally Police