అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏదో కుట్ర ఉంది : సింగర్ కల్పన

 

2024-12-15 06:42:17.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/15/1386044-kalpana.webp

ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏదో కుట్రకోణం ఉందని టాలీవుడ్ సింగర్ కల్పన అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏదో కుట్రకోణం ఉందని టాలీవుడ్ సింగర్ కల్పన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి నేషనల్ ప్రైడ్ లాంటి హీరోను ఎదో దొంగ తనం, లేదా ఏదో పెద్ద క్రైమ్ చేసిన వాడిలాగా బెడ్ రూంలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ఇది న్యాయం కాదు. కచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక రోజు జైలు జీవితం తర్వాత ఆయన విడుదలయ్యారు. ప్రస్తుతం బన్నీ మీద పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు బాధిత వ్యక్తి భాస్కర్ సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 8 ఏళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. 

 

Allu Arjun,Tollywood Singer Kalpana,Sandhya thiyetar,Chikkadapally Police,Nampally Court,Chanchalguda Jail,High Court Interim Bail