2024-12-13 16:03:58.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385672-rgv.webp
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దర్శకుడు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు అంటూ పోస్టు పెట్టారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా వివాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. బన్నీ కేసు గురించి సంబంధిత అధికారులకు నా 4 ప్రశ్నలు’ అంటూ పోస్టు పెట్టారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలివీ..
ముఖ్యంగా అందులో 1.పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?. 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?. 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?. 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అనిరామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
RGV,Megastar Chiranjeevi,Allu Arjun,Chikkadapally Police Station,Pushpa-2 movie release,Sandhya Theatre,Gandhi Hospital,Nampally Criminal Court,CM Revanth reddy