అల్లు అర్జున్ ఇంటికి వెళ్లనున్న డార్లింగ్ ప్రభాస్

 

2024-12-14 09:15:12.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/14/1385790-allu-arujn.webp

ఇవాళ సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి ప్రభాస్ వెళ్లనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి

జైలు నుంచి ఇంటికి చేరుకున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సీనీవర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్‌బాబుతో పాటు తదితర నటీనటులు బన్నీ నిపాసానికి వచ్చారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌తో శనివారం ఉదయం విడుదలై.. ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో చేరుకుని.. అక్కడి నుండి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వచ్చారు.

ఆయన ఇంటికి వచ్చినప్పటి నుండి.. టాలీవుడ్ సినీ ప్రముఖులెందరో అల్లు అర్జున్‌ని పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు క్యూ కట్టారు. బన్నీ నిన్న అరెస్ట్ అయ్యాాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్దకు చేరుకున్నాడు అల్లు అర్జున్. వాస్తవానికి నిన్న రాత్రినే విడుదల కావాల్సి ఉండగా.. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల కాపీ ఆలస్యం కావడం.. లాయర్లు తీసుకొచ్చిన ఫార్మాట్ సరిగ్గా లేదని జైలు సూపరింటెండెంట్ అల్లు అర్జున్ ను జైలులోనే ఉంచారు.

 

Darling Prabhas,Allu Arjun,Vijay Devarakonda,Rana,Sudhir Babu,Chanchal Guda Jail,Geeta Arts Office,Jubilee Hills