2024-12-22 13:14:22.0
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు.. ఆమె కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకున్నది. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. రాల్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Allu Arjun’s house,Attacked,Student unions leaders,Sandhya Theater Issue,Revathi’s death,Demand to pay Rs. Crore compensation