2024-12-25 09:15:47.0
కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదన్న కేంద్ర మంత్రి
కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారు. ఆయన చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా అక్కడి వెళ్లలేదు.
బీజేపీ ఒత్తిడి మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ విగ్రహ నిర్మాణం పూర్తి చేసింది. అంబేద్కర్‌కు సంబంధించిన పంచ తీర్థాలను రాహుల్‌గాంధీ దర్శనం చేసుకోవాలి. అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయి. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ ఆంధ్రాకు తరలివెళ్తే తెలంగాణకే నష్టం. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా వారి అధిష్టానం అదుపులో పెట్టాలని బండి సంజయ్ అన్నారు.
CM Revanth Reddy,Conspiring,Against film industry,Central Minister Bandi Sanjay Kumar,Congress leaders no right,Talk about Ambedkar