అల్లు అర్జున్‌ కేసులో కీలక మలుపు

2024-12-13 11:01:06.0

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని తెలిపారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక పరిమణం చోటుచేసుకుంది. ఆర్టీసీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ కేసును రేవతి భర్త భాస్కర్ విత్ డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై చనిపోయిన రేవతి భర్త భాస్కర్ మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని ఆయన కోరాడు. ఈ నేపథ్యంలోనే చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. హీరో అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈక్రమంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు బందో బస్తును చేపట్టారు. దీంతో అల్లు అర్జున్ ను రిమాండ్ విధించనున్నట్టు స్పష్టమవుతోంది

Icon star Allu Arjun,Megastar Chiranjeevi,Allu Arjun,Chikkadapally Police Station,Pushpa-2 movie release,Sandhya Theatre,Gandhi Hospital,Nampally Criminal Court,CM Revanth reddy,Chanchalguda Jail