2024-12-24 10:08:07.0
అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు ఆపడం లేదు. తాజాగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఆంధ్రోడివి…ఆంధ్రోడిలాగానే ఉండి..నీవు బ్రతకడానికి తెలంగాణకు వచ్చావు.. అలాగే బ్రతుకు మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుని మీ వ్యాపారాలేవే చేసుకోండన్నారు. కొడకా మా సీఎం రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే నీ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు అని ఘూటు వ్యాఖ్యలు చేశాడు. నువ్వో పగటి వేశాడవని, ఓ చెత్త సినిమా ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప తీశావంటూ మండిపడ్డారు.
అదేమైనా సమాజాన్ని బాగు పరిచే సినిమానా అని చురకలేశారు. తెలంగాణకు నీవు చేసిందేముందంటూ దుయ్యబట్టారు. మీ వ్యాపారాలు మీ సినిమాలేవో చేసుకుని మీ బతుకు మీరు బతుకండని హితవు పలికారు. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ ని ఇటీవలే అరెస్ట్ చేయడం.. చంచల్ గూడ జైలుకు తీసుకువెల్లడం.. వెంటనే హైకోర్టు బెయిల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇవాళ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లి విచారించారు.
Allu Arjun,Congress MLA Bhupathi Reddy,Puspa movie,CM Revanth Reddy,Jubilee Hills,Sandhya theater case,Antony,Stampede,Kancharla Chandrasekhar Reddy,Allu arjun,Chikkadapally police station,Sandhya Theatre,CM Revanth reddy,Pushpa 2 movie,Sukumar,Allu Arvind,Allu arjun arrest