2024-12-24 09:45:08.0
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ పోలీసుల విచారణ పూర్తయింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ పోలీసుల విచారణ పూర్తయింది. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నీని తొక్కిసలాట ఘటన పై మూడు గంటలకు పైగా విచారించారు. న్యాయవాది అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్‌ను విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు..? రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కీలకమైన బౌన్సర్ల అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు.
బౌన్సర్లపై పోలీసులు వేసిన ప్రశ్నలకు అల్లు అర్జున్ నుంచి సరైన సమాధానం రాలేదంట. మార్చిపోయాను నాకు తెలియదు గుర్తులేదు అని చెప్పినట్లు తెలిసింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అయితే, పోలీసుల ప్రశ్నలకు బన్ని చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు విచారణ అనంతరం అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. అక్కడ సీన్‌రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ ముగియడంతో బన్నీ పీఎస్ ఇంటికి నుంచి వెళ్లిపోయాడు.
Jubilee Hills,Allu Arjun,Sandhya theater case,Antony,Stampede,Kancharla Chandrasekhar Reddy,Allu arjun,Chikkadapally police station,Sandhya Theatre,CM Revanth reddy,Pushpa 2 movie,Sukumar,Allu Arvind,Allu arjun arrest