2025-02-04 09:32:41.0
కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ
సామాజిక, ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉయభ సభలు ఇవాళ సమావేశమయ్యాయి. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది (17.34 శాతం) ఉన్నారు. బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 1,64,09,179 మంది (46.25 శాతం) ఉన్నారు. ఎస్టీలు 37,05,929 మంది (10.45 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది ( 12.56 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 మంది (10.08 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 మంది (2.48 శాతం) ఉండగా.. ఓసీలు 56,01,539 మంది ( 15.79 శాతం) ఉన్నారని సీఎం వెల్లడించారు.
కుల గణన సర్వే నివేదికపై అసెంబ్లీలో సీఎం ప్రసంగ పాఠం
CM Revanth Reddy,Introduced.Caste census survey report.In Assembly,Discussion in Assembly on caste,SC classification