2024-10-03 12:45:23.0
పాల్గొన్న మండలి చైర్మన్, డిప్యూటీ, చైర్మన్
https://www.teluguglobal.com/h-upload/2024/10/03/1365736-bathukamma-assembly.webp
అసెంబ్లీలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అసెంబ్లీ, కౌన్సిల్ మహిళా ఉద్యోగులు, సిబ్బంది గురువారం బతుకమ్మలు పేర్చి అసెంబ్లీ లాబీల్లోని మెంబర్స్ లాంజ్ బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, రామచంద్రు నాయక్, ఆది శ్రీనివాస్, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Bathukamma,celebrations,assembly