2024-12-16 07:28:00.0
తెలంగాణ అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిరాకరించారు.
తెలంగాణ శాసన సభ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి నో ఎంట్రీ విధించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం పట్ల బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. అలాగే మీడియాపై కూడా పలు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎటువంటి వీడియోలు తీయొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. కాగా అసెంబ్లీలో ఆంక్షలు పెట్టడంపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి నో ఎంట్రీ బోర్టులు పెట్టారని మండిపడుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్న మొన్నటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్ లైవ్ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై ఎలాంటి ఆంక్షలు లేవని గుర్తు చేస్తున్నారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ప్రజా పాలన అంటూ ఎక్కడికక్కడ.. నిర్బంధకాండను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Assembly Inner Lobby,Restrictions on media,no entry,Former public representatives,Telangana assembly meetings,KCR,KTR,BRS Party,Deputy cm Mallu Bhatti Vikramarka,CM Revanth reddy